చేనేత వస్త్రాలతో పండుగ చేద్దాం.. నేతన్నలకు అండగా ఉందాం : నారా భువనేశ్వరి


అమరావతి : చేనేత వస్త్రాలతో పండుగ చేద్దాం.. నేతన్నలకు అండగా ఉందామని నారా భువనేశ్వరి X వేదికగా తెలుగు రాష్ట్రాల ప్రలకు పిలుపునిచ్చారు. నిజం గెలవాలి కార్యక్రమ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించినప్పుడు చేనేత కార్మికులను కలిసి, వారు పడే కష్టాలు, ఎదుర్కొనే ఇబ్బందులు నేరుగా తెలుసుకున్నానని నారా భువనేశ్వరి అన్నారు. మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల, గద్వాల్ చేనేత వస్త్రాలు ఎంతో ప్రసిద్ధి చెందినవని ఆమె చెప్పారు. 

నూలు సేకరించడం నుండి బట్టనేసే వరకూ చేనేత కార్మికులు పడే కష్టాలు ఎన్నో. ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా కష్టపడి నేతన్నలు వస్త్రాలు తయారు చేస్తారని భువనేశ్వరి కొనియాడారు. వారి బిడ్డల కోసం, కుటుంబం కోసం ఇబ్బందులన్నీ భరించి పని చేస్తారు. చేనేత కార్మికులు నూలు పోగుతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. 

అందుకే చేనేత కార్మికులకు సంఘీభావంగా మనమంతా పండుగ రోజు చేనేత వస్త్రాలు ధరించి  నేతన్నలకు అండగా నిలుద్దామని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. మన చేనేత, మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని కాపాడుకుందామని అన్నారు.

Comments