అలయ్-బలయ్ ఓ రాజకీయ పబ్లిసిటీ స్టంట్..!
"మానవ సoబంధాలన్నీ ఆర్ధిక సంబధాలుగా ఉంటున్న నేపథ్యం"లో అలాయి బలాయి లాంటి వాటికి విలువ ఎంత? సార్ధకత ఎంత ఉందో చూడాలి. ఇంటికి చుట్టాలు వస్తేనే భయపడే ఈరోజుల్లో... దసరా తరవాత రోజు ప్రతీ సంత్సరం అలాయి బలాయి పేరుతో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ గత 19 ఏళ్లుగా వేలాదిమందికి భోజనం పెడుతున్నారు, కాదు కాదు భోజన పోటీలు పెడుతున్నారు.19 ఏళ్లుగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు దత్తాత్రేయ దేనికీ లెక్కలు చెప్పిన దాఖలాలు లేవు. భోజనం అంతవరకు సరే... కానీ ఆది రాను రాను ఓ పబ్లిసిటీ ఈవెంట్ గా.. పొలిటికల్ డ్రామాగా మారింది... రాజకీయ వేదికగా మలుపులు తిరుగుతోంది... పేదలకు అన్నం పెట్టడంలో తప్పులేదు, మానవత్వంతో కూడింది అయితే తప్పులేదు. దానికి రాజకీయత్వం తోడై స్వార్ధం కూడా కనబడుతున్నది. అలాయి బలాయి ఎవరికోసం ఎందుకోసం? వేలాదిమందికి మటన్, చికెన్, ఫిష్ తలకాయకూర ఇంకా వివిధ రకాల ఖరీదైన వంటకాలు పెడుతున్నారు. దేనికోసం! డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయి ఎవరు ఎలా ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు? వాటికి రసీదులున్నాయా? ట్ర్రస్ట్ పేరుతో వసూలు చేస్తున్నారా... చందాలా.. దండాలా.. దత్తాత్రేయ స్వంతంగా ఖర్చు పెడుతున్నారా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.. పేదలకు భోజనం పెడితే ట్రస్ట్ ల పేరుతో కొటీశ్వరులైన వాళ్ళను పెద్దల లాంటి గద్దల నాయకులను... పిలవటం ఎందుకు! ఖర్చులకు పారదర్శకత లేని అలాయి బలాయి బీజేపీ నాయకుడి బల ప్రదర్శనకు పేదల పక్షాన నిలిచే కూనంనేని సాంబశివరావు లాంటి ప్రశ్నించే నాయకులు రావడం విడ్డురం కాదా! ఒక పక్క సిపిఐ జాతీయ నాయకులు నారాయణ ప్రొఫెసర్ సాయిబాబా హత్య ప్రభుత్వ హత్య అని అంటున్నారు.. దత్తాత్రేయ బీజేపీలో భాగం కాదా? గతంలో దత్తాత్రేయ ఈ అలాయి బలాయిని ఎంపి గా గెలవటం కోసం ఉపయోగించుకుంటే... ఇప్పుడు తన బిడ్డ విజయలక్ష్మిని పొలిటికల్ లీడర్ గా ఎస్టాబ్లిష్ చెయ్యటం కోసం ఒక స్టంట్ గా.. పొలిటికల్ ఈవెంట్ గా మారుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అందుకే పేదల పేరుతో పెద్దల లాంటి గద్దలను పిలవద్దు. ట్రస్టుల పేరుతో నయా మోసకారులను పిలవద్దు. వీలైతే ముషీరాబాద్ లో పేదలకు అన్నం పెట్టు... లేదా స్టార్ హోటల్ గద్దలను పిలిచి పొలిటికల్ పబ్లిసిటీ ఈవెంట్ అన్నా చేసుకో... రెండు చేసి... ప్రజలను తికమక పెట్టొద్దు.ఐఏఎస్, ఐపీఎస్, గవర్నర్, మంత్రి లాంటి వాళ్లకు ఎక్కువ హోదా జీతం ఉంటే వాళ్ళ పెళ్ళాం పిల్లలు సుఖంగా ఉంటారు. వాళ్ళ స్వార్ధం కోసం కొట్లాది రూపాయలు ఖర్చు పెడితే వాళ్ళు ప్రజలకు జవాబుదారిగా ఉండాలి. సమాజం మీద ప్రేమ ఉండి అత్యధికంగా ఖర్చు పెట్టే దత్తాత్రేయ లాంటి వాళ్ళు.. ప్రెస్ మీట్ పెట్టి లెక్కాపత్రం చెప్పాలి. హోదాతో బారాకూన్ మాఫి అంటే ఎలా? దత్తాత్రేయ ఎన్ని వేల మంది వచ్చినా తాను చెయ్యాల్సిన వంట అంతేచేసి చాటలో తౌడు పోసి అనే చందంగా తొక్కిసలాటకు కారణమౌతున్నారు. వండిన దానికంటే రెండు వంతుల మంది ఎక్కువ వస్తారు. వాళ్లకు పిలుపు పలకరింపు ఉండదు వాళ్ల కంటికి ఆనిన వాళ్ళకే పిలుపు.. సాంఘిక వెనుకబాటుతనం, ఆర్ధిక వెనుకబాటుతనం ఆకలి అవసరం ఉన్న పేదలే ఎక్కువ వస్తారు వాళ్ళే మీడియా కెమెరాలలో సమిధలుగా బందీలవుతారు. దత్తాత్రేయ అండ్ టీమ్ అతిధుల సేవలో అంబలి తాపిస్తూ వాళ్ళ స్థాయిని బట్టి మర్యాద చేస్తూ తరిస్తుంటారు. వచ్చిన క్రౌడ్ ని పట్టించుకోరు. వచ్చిన వాళ్ళను చక్కబెట్టే విధానమే లేదు.. అక్కడ మూడొంతుల జనం ఉంటే ఒక్కవంతుకే వంట చేస్తారు. ఆ భోజనం పోటీలో కొంతమేరకే కడుపు నిండుద్ది... మెనూను మీడియాలో చెప్పి ఆకర్షిస్తారు.. అవన్నీ ఆ క్రౌడ్ లో అందరికి దొరకవు నెగ్గినోడికి కొంత మేర నిండుద్ది, నెగ్గనోడికి మండుద్ది కడుపు మాడ్చుకొని గునుగుకుటు వెళ్ళిపోతారు ముఖ్య మంత్రులను కూడా పిలవటంతో ఆ సెక్యూరిటీ మనుషులను తొక్కుకుంటూ పోతున్నారు. ప్రజలు లేనిది పదవులు లెవ్వు హోదాలు లెవ్వు ఆ తొక్కిసలాటలో.. గొప్ప మేధావులైన పాశం యాదగిరి, మాడభూషి శ్రీధర్ ఉక్కిరిబిక్కిరి అయి ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడ్డామని వారే రాసుకున్నారు. తార్కిక దృష్టి కలిగి ప్రజాపక్షం వహించే వారిద్దరు పొలిటికల్ పబ్లిసిటీ ఈవెంట్ గా మారిన ఈ ప్రోగ్రాంకి రావటం ఏంటి? కోట్లాది రూపాయల ఖర్చుకూ జవాబు దారి తనం లేని దత్తాత్రేయ ప్రోగ్రాం కి పోవటం కూడా వారి తప్పే అవుతుంది అలాయి బలాయి అని నామకరణం చేసిన పాశం యాదగిరినే నామరూపం లేకుండా చేసేంత పని జరిగింది. ప్రమాదం జరిగితే కంట్రోల్ చెయ్యలేని గ్యాదరింగ్ కి దత్తాత్రేయే కారణం అవుతారు బతికి బయట పడ్డారు కాబట్టి సరిపోయింది లేకపోతే నెక్స్ట్అలాయి బలాయి ఉండదు పోలీసులు పర్మిషన్ కూడా ఇవ్వరు. ఆయన బిడ్డ రాజకీయ లక్ష్యం నెరవేరదు. దత్తాత్రేయ వ్యక్తిగా మంచోడే పారదర్శకత జవాబుదారి తనంలేని పనులు ఎందుకు చేస్తున్నాడో అర్ధంకాదు. వచ్చే దసరా నుంచైనా మీడియాకి లెక్కలు చెబుతారని ఆశిద్దాం
ఇదిలా ఉండగా దత్తాత్రేయ తన కూతురిని తన స్వకులేతురలకు ఇచ్చి అరేంజ్డ్ మ్యారేజ్ చేసశారు. దత్తాత్రేయ ఓ స్థాయికి ఎదిగిన బీసీ నాయకుడు. పరాయి కులానికి తన కూతురిని ఇవ్వడంతో గొల్ల కురుమల్లో కొంత వ్యతిరేకత కూడా ఉంది. దాంతో పిలిస్తే పెళ్ళికిరాని తన కులస్థులు ఉన్నారు. బలహీనవర్గ వాదం బలంగా వినపడుతున్న నేటి నేపథ్యంలో దత్యాత్రేయ స్వకులస్థులు గొల్లకురుమలు బీసీలు ఏ విధంగా విజయలక్ష్మి ఎదుగుదలకు ఉపయోగ పడతారో చూడాలి? అందుకే తన పారదర్శకతను నిరూపించుకోవటానికి అలాయి బలాయి లెక్కలు ప్రజలకు చెప్పాలి. మెజారిటీ వర్గానికి చెందిన విజయలక్ష్మి మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తితో ముడిపడిన వైనం ఒకపక్క బలహీనవర్గ బలం రాజకీయంగా పెరుగుతున్న నేపథ్యంలో గొల్లకరుమ కులానికి ఇచ్చి పెండ్లి చెయ్యలేదనే కోపం స్వకులస్థులలో వుంది. విజయలక్ష్మి రాజకీయ ఎదుగుదలకు ఈక్వ్వేషన్స్ ఏ మాత్రం ప్రభావం చూపిస్తోందో వేచిచూద్దాం. కేవలం డబ్బే ప్రధానమవుతుందో వేచిచూద్దాం.
- సాదం వెంకట్,
సీనియర్ జర్నలిస్ట్,
మొబైల్: 93953 15326