వెలుగు గుట్ట శ్రీ దుర్గా పరమేశ్వరి శరన్నవరాత్రులు ప్రారంభం

తొలిరోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనం

ఇవాళ శ్రీ పంచముఖ గాయత్రి అలంకారం


హైదరాబాద్‌ ఉప్పల్ క్రికెట్ గ్రౌండ్‌ను ఆనుకుని ఉన్న వెలుగు గుట్ట పచ్చని చెట్ల మధ్యలో ఆహ్లాదకరమైన వాతావరణం లో కొలువు తీరిన శ్రీ దుర్గా పరమేశ్వరి అమ్మ వారు భక్తుల కోరికలు తీర్చే చల్లని తల్లి. ఆ జగన్మాత ఈ క్రోధి నామ సంవత్సర దేవీ శరన్నవ రాత్రులలో రోజూ ఒక అలంకరణలతో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం మొదటి రోజున అమ్మ వారు బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో కన్నుల పండుగ గా భక్తులకు దర్శనం ఇచ్చారు. 

ఉదయం అమ్మ వారికి పంచామృత అభిషేకము, షోడశ ద్రవ్యాలతో అభిషేకము, విశేష అలంకారము, సుహాసినులతో సామూహిక కుంకుమ అర్చనలు, 18 రకాల విశేషమైన మంగళ హారతులు తీర్థప్రసాద వితరణ అత్యంత భక్తి శ్రద్ధలతో విశేషమైన భక్తుల సమక్షంలో జరిగినాయి. అనంతరం చండీ హోమం భక్తుల యోగక్షేమాలను కోరుతూ విశేషంగా జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు  పూర్ణాహుతీ మహా మంగళహారతి జరిగినది. అనంతరం దాతలచే అన్న ప్రసాద వితరణ ఆ జగన్మాత ప్రసాదంగా భక్తులకు అందించడం జరిగినది. 


దేవాలయం నందు క్రొత్తగా దాతలచే నిర్మించిన యాగశాల మరియు వంటశాల ఈ రోజున ఉదయం ప్రారంభించడం విశేషం సాయంత్రం 6 గంటలకు శ్రీచక్రానికి  బిల్వార్చన జరిగినది. అనంతరం అమ్మ వారి ఊంజల్ సేవ తీర్థప్రసాద వితరణ భక్తుల మధ్య విశేషంగా జరిగింది. ఈ విశేష కార్యక్రమాలు దేవాలయ కార్య నిర్వహణ అధికారి, జన్ని రఘు, శ్రీ గొరిగే మల్లేష్ (ఎ.జి.పి.),రుక్నపాల్ రెడ్డి, విజయ్ కుమార్ సంతోష్ , నవీన్, సూర్య ప్రకాష్ ,  గీత, లక్ష్మీ , కవిత  దేవాలయ అర్చక సిబ్బంది మరియు అధిక సంఖ్య లో పాల్గొన్నారు. ఇవాళ అమ్మ వారు శ్రీ పంచముఖ గాయత్రి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

Comments