ఫిబ్రవరి 14న కులగణన, వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రజంటేషన్...

మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో అవగాహన
పాల్గొననున్న రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి
గాంధీభవన్ ప్రకాశం హాల్‌లో కార్యక్రమం

Congress Manifesto in Telangana to Attract Young Voters with Job Calendar |  Telangana Tribune

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బిసి కులగణన, ఎస్సీ వర్గీకరణలపై కాంగ్రెస్ నాయకులకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ మద్యాహ్నం 2 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై సమగ్ర సమాచారం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ మంత్రి దామోదర రాజనర్సింహ, సభ్యులు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవితో పాటు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పాల్గొని ప్రజెంటేషన్ ఇస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి దీపదాస్ మున్షిలు ముఖ్యఅతిథిగా పాల్గొంటారు.

ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజక వర్గ ఇంచార్జ్‌లు, పోటీ చేసిన అభ్యర్థులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, డీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యవర్గ ప్రతినిధులు, అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Comments